కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చిన జి రామ్ జి పథకాన్ని తక్షణం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ముందు పూలు పెట్టి నివాళి అర్పించారు. అనంతరం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం అందరితో కలిసి పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వీరభద్ర రావు మాట్లాడుతూ గ్రామీణ పేదలకు పని హక్కు కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం. గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రధాన భూమిక పోషించిందని. పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం ఇవ్వడంతో పాటు వ్యవసాయ రంగానికి రైతంగానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడిందని ఆయన అన్నారు. అటువంటి ఉపయోగంగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కాంట్రాక్టులకు కట్టబెట్టేందుకు జిరామ్ జి పథకాన్ని తీసుకురావడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాత చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు విశ్వనాథం సుబ్బారావు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


