అపార త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రాన్ని సుస్థిరం చేస్తూ, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తోంది భారత రాజ్యాంగం 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయ జనతాపార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో తణుకు పట్టణం (సజ్జాపురం)లో పెంటపాటి పుల్లారావు నగర్ బైపాస్ అండర్పాస్ వద్దగల వినాయకుని గుడివద్ద నిర్వహించిన జాతీయపతాక ఆవిష్కరణలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డా. ముళ్ళపూడి రేణుక. భారత జాతీయ జెండాను తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజుతో కలసి ఆవిష్కరించి, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రధాన కార్యదర్శి రాసాబత్తుల అనుకుమార్, పట్టణ ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, మహిళా మోర్చా అధ్యక్షురాలు గంటా లక్ష్మి, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు పూలమాల వీరభద్రం, పట్టణ కార్యదర్శి భానుసతీష్, ఎస్సీ మోర్చ జిల్లా నాయకులు కొడమంచిలి జితేంద్ర, బిజెపి సీనియర్ నాయకులు దాట్ల సూర్యనారాయణరాజు, యువ మోర్చాఅధ్యక్షులు మారిశెట్టి అజయ్,యువ మోర్చా ప్రధాన కార్యదర్శి నూకల నాగేంద్ర, గంటా శ్రీనివాసరావు, ఎల్లమిల్లి సతీష్, బిజెపి నాయకులు గుడివాడ రామయ్య, చింతపల్లి రాజు, చింతపల్లి చంద్రకళ, కొల్లి శ్రీనివాసు, వంగ రాధాకృష్ణ, ఎ.బి.వి.పి. పట్టణ కార్యదర్శి పవన్ కుమార్, ఎ.బి.వి.పి. నాయకులు పాల్గొన్నారు.


