రాష్ట్ర బిజేపి అధికార ప్రతినిధి డా.ముళ్ళపూడి రేణుక
ఎన్డీఏ ప్రభుత్వం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికత అని అర్థం, ఈ కార్యాచరణలో యువత, పేదలు, మహిళలు, రైతులపై దృష్టి సారిస్తూ విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత వంటి రంగాలలో సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. గ్రామీణ అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి, దాని ద్వారానే వికసిత్ భారత్ సాధ్యం కాబట్టి, రెండు దశాబ్దాలుగా భారతదేశంలో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం యొక్క మార్పులను వివరించడానికి రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక శనివారం తణుకులో శ్రీ చిట్టూరి హెరిటేజ్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పేదలకు 125 రోజుల పని దినాల కల్పనే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం
వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవ్ కమిషన్ గ్రామీణ్ తీసుకొచ్చిందని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలోనూ అత్యధిక శాతం నిధులను ఉపయోగించుకుంటున్నటువంటి ఉపాధి హామీ పథకం ఎప్పుడు కూడా బాగా దీన్ని ఉపయోగించుకోవడం మూలంగా దీన్ని చాలా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఎక్కువగా వాడుకున్నటువంటి సందర్భం లో చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క పథకం కూడా మనం గమనించామని, ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి సాంకేతికత లేకపోవడం పారదర్శకత ఏదైతే ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి దేనికి వాడాలి అనేటువంటి నియమ నిబంధనలో పరిమితంగా ఉండటం మూలంగా చాలా రాష్ట్రాల్లో నిధులు కూడా ఈ యొక్క స్కీం మీద ఖర్చు పెడితే దుర్వినియోగం అయ్యాయనిఅన్నారు. అందువల్ల నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకంలో ఆధార్ లింక్ జియో ట్యాగింగ్ ద్వారా పని ప్రదేశాలను గుర్తించడం, రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా బాధ్యత పెంచడానికి 60 40% నిష్పత్తిలో మార్పులు జరిగాయని అన్నారు. ప్రతిపక్షాలు పేర్కొన్నట్లు పని దినాల్లో ఉపాధి హామీ పనులు తగ్గింపు లేదని వేరే హౌసింగ్ నిర్మాణం కూడా చేపట్టే దిశగా ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేసిందని అన్నారు.


