అంతరించిపోతున్న కళలకు జీవం పోయడమే ‘పీఠికాపుర సంక్రాంతి సంబరాలు’ లక్ష్యం

పిఠాపురం: అంతరించిపోతున్న ప్రాచీన కళలను కాపాడటానికి, చేతివృత్తులను ప్రోత్సహించి మన సాంస్కృతిక వైభవాన్ని పునర్జీవింపజేయడానికే ‘పీఠికాపుర సంక్రాంతి సంబరాలను’ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గం ఓ.బి.ఎస్. మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ సంబరాల్లో తోలుబొమ్మలాట, తప్పెటగుళ్ళు, హరికథ, బుర్రకథ, జముకులాట వంటి అరుదైన కళారూపాలను ప్రదర్శించడం ద్వారా మన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నామన్నారు. కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేసి హస్తకళాకారులకు అండగా నిలిచామని తెలిపారు.

ప్రపంచ రాజకీయ చరిత్రలో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో జనసేనను గెలిపించి, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరణకు జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించడం, ‘పల్లె పండుగ’ ద్వారా గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టడం విప్లవాత్మకమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన జల్ జీవన్ మిషన్ నిధులను వినియోగించి ఉభయ గోదావరి మరియు ప్రకాశం జిల్లాల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ‘అమరజీవి జలధర వాటర్ గ్రిడ్’ ప్రాజెక్టుకు నిడదవోలు నియోజకవర్గం లోని పెరవలి వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని తెలిపారు.

ఎమ్మెల్యేగా తనకు వచ్చే వేతనాన్ని పిఠాపురంలోని అనాథ పిల్లల సంక్షేమానికి కేటాయించడం పవన్ కళ్యాణ్ గారి సేవా నిరతికి నిదర్శనమని మంత్రి కొనియాడారు. ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో పరిపాలన దక్షుడైన సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి సూచనలు దిశానిర్దేశం చేస్తున్నాయని, పర్యావరణం మరియు ఎకో టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని మంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పేదరికం లేని సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

పేదవాడి కంట కన్నీరు రాకుండా, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, పేదవాడికి అండగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన మహా నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. రాజకీయ అధికారమంటే పరపతి ఉన్న వారికి కాదు పేదవారికి చేయూతనివ్వాలని పార్టీని స్థాపించి, పది సంవత్సరాలు మొక్కవోనని ధైర్యంతో పార్టీని నడిపించారు.. నడిపిస్తున్నారు అన్నారు.. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జనసేన శ్రేణులు తలెత్తుకొని నిలబడుతున్నామంటే అందుకు కారణం జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అని, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అని అన్నారు. నాడు నియంతృత్వ పాలనను అంత మొందించాలని ఆలోచన చేయకపోయి ఉంటే, కూటమి ఏర్పాటు చేయకపోయి ఉంటే నేడు ప్రజాస్వామ్య పాలన సాధ్యమయ్యేది కాదన్నారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా పయనింపజేయాలన్న ఆలోచనతో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందరం బలం అందించాలని కోరారు. చేసే ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడానికి అందరి సహకారం అవసరమన్నారు.

అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. మంత్రి కందుల దుర్గేష్ స్పీచ్ తో సభా ప్రాంగణమంతా మారుమోగిపోయింది.

Scroll to Top
Share via
Copy link