పల్లె పండుగ’తో గ్రామాల్లో అభివృద్ధి

:- మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గంలో “స్వచ్ఛ సంక్రాంతి- స్వచ్ఛ గ్రామ పంచాయతీలు” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గంలోని సింగవరం, కంసాలిపాలెం, రావిమెట్ల, తిమ్మరాజుపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, కోరుమామిడి గ్రామాల్లో దాదాపు కోటి రూపాయల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్డు నిర్మాణ, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు: పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, గ్రామీణ రూపురేఖలు మారుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం పల్లె పండుగ 2.0లో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలోని సింగవరం, కంసాలిపాలెం, రావిమెట్ల, తిమ్మరాజుపాలెం, ఉనకరమిల్లి, తాడిమళ్ల, కోరుమామిడి గ్రామాల్లో దాదాపు కోటి రూపాయల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్డు నిర్మాణ, ప్రారంభోత్సవాల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ తో పాటు స్థానిక టీడీపీ ఇన్ చార్జి, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు తో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.. తొలుత రూ.9 లక్షల వ్యయంతో సింగవరం గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డును కొబ్బరికాయ కొట్టి మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్థులు, మహిళలను సమస్యలపై ఆరా తీశారు. సైడ్ కాలువలు, డ్రైనేజీలు, మంచినీరు తదితర సమస్యల గురించి అడగగా త్వరలోనే డ్రెయిన్ల నిర్మాణం చేపడుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కంసాలిపాలెం గ్రామంలో రూ.14 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిపై నడుస్తూ స్థానిక కూటమి నాయకులతో మాట్లాడారు. ఎస్సీ ఏరియాలో స్మశానవాటిక ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా స్పందించిన మంత్రి దుర్గేష్ వెంటనే సంబంధిత అధికారులతో చర్చించారు. ఆ తర్వాత రూ.13.5 లక్షలతో రావిమెట్లలో, రూ.12.5 లక్షలతో తిమ్మరాజుపాలెంలో, రూ.13.8 లక్షలతో ఉనకరమిల్లిలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. రూ.20 లక్షలతో తాడిమళ్లలో గోకులం పశువుల షెడ్డు, సీసీ రోడ్ల నిర్మాణం, రూ.20 లక్షలతో కోరుమామిడి గ్రామంలో సీసీరోడ్డును, గోకులం షెడ్డును ప్రారంభించారు. అనంతరం కంసాలిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సంక్రాంతి, గ్రామసభలో పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో చర్చించి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సీసీ రహదారులను వేస్తున్నామన్నారు. డ్రెయిన్ ల నిర్మాణానికి కృషి చేస్తున్నానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినందుకు రాష్ట్రంలోనే తొలిసారి రూ.11 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులను నిడదవోలు నియోజకవర్గానికి కేటాయించారని గుర్తుచేశారు. అనంతరం పల్లె పండుగ 1.0, 2.0 ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం జరిగిందని, ఇవాళ ప్రారంభించామని తెలిపారు. పల్లె పండుగతో గ్రామాల్లో పండగు వాతావరణం నెలకొందన్నారు.త్వరలోనే ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు. ఎర్రకాలువ ముంపును నియంత్రించేందుకు తాత్కాలికంగా తొలుత గేట్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించామని, ఈ క్రమంలో నేడు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. తద్వారా పంచాయతీల్లో శాస్త్రీయ విధానంలో ఘనవ్యర్థాల నిర్వహణ చేపట్టి చెత్తరహిత, పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలు గ్రామసభల్లో పాల్గొని గ్రామాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. అందమైన పరిసరాలను తయారు చేసిన అధికారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి పాలనలో తేడా గమనించాలన్నారు. కంసాలిపాలెం- మాధవరం బ్రిడ్జి విషయమై నిడదవోలుతో పాటు తాడేపల్లిగూడెం శాసనసభ్యుడితో చర్చించి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త రూపు తెస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మంత్రి దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కూటమి నాయకులు మంత్రి కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. జై కందుల నినాదాలు చేశారు. గ్రామసభల్లో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link