సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ప్రాంగణంలో తెలుగు రాజు పెనుమత్స సత్యనారాయణ రాజు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ సాహిత్య సాహిత్యానికి వెలుగు తెచ్చిన కీర్తి శిఖరం, తెలుగు సంస్కృతికి మణిహారం పెనుమత్స సత్యనారాయణ రాజు అని అన్నారు. సత్యనారాయణ రాజు జయంతి సందర్భంగా సన్మానం గ్రహీత తెలుగు సీనియర్ ఉపాధ్యాయురాలు తమ్మా కామేశ్వరి మాట్లాడుతూ నాటికి నేటికి ఏనాటికి పాఠకుల స్మృతిలో తెలుగు రాజుగా సుప్రసిద్ధులై జన హృదయాలలో జీవించే ఉంటారని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా నిర్వహించిన సదస్సు లో పలువురు వక్తలు మాట్లాడి ఆయన జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కందుకూరి పద్మావతి, ఉపాధ్యాయురాలు షేక్ షర్మిల, జుత్తిగ ఉమాదేవి, రజనీకుమారి, ఉపాధ్యాయుడు నాగరాజు, వెంకటరాజు, తాతపూడి మారుతీ రావు, ముక్కామల మోహనరావు ఆకెళ్ళ సుబ్రమణ్యం, ఆలపాటి సుబ్బారావు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


