భారతరాజ్యాంగం అందరికీ హక్కులు, బాధ్యతలు కూడా ఇచ్చింది

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తణుకు సబ్ జైల్ యందు గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి ఆదేశముల మేరకు తణుకు ప్యానెల్ న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటీర్ లు రిమాండ్ ముద్దాయిలకు మానవహక్కుల గురించి తెలియ చేసారు. ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయని వాటిని ఎదుట వారికి ఇబ్బందికరంగా చేయకూడదని, రాజ్యాంగం అందరికీ హక్కులు, బాధ్యతలు కూడా ఇచ్చిందని, అందరూ హక్కుల కోసమే మాట్లాడుతున్నారని, బాధ్యతల గురించి తెలుసుకోటుల్లేదని, రాజ్యాంగం ప్రతి ఒక్కరు స్వేచ్ఛ, సమానత్వాలతో జీవించాలని తెలిపారు. ముఖ్యంగా రిమాండ్ ముద్దాయిలను ఉద్దేశించి ఎదుటవారి హక్కులను అణచివేయకూడదని తెలిపారు. ఇందులో న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు, పోణంగి శ్రావణి సమీరా, కామన మునిస్వామి, అంగజాల అజయ్ కుమార్, జైలు క్లినిక్ న్యాయవాది డి.కృష్ణ కుమారి, పారా లీగల్ వాలంటీర్ లు శ్రీ కాకర్ల నరసన్న, పి.శ్రీదేవి, జైలు సూపరింటెండెంట్ జి.మోహనరావు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link