:- మంత్రి కందుల దుర్గేష్
ఎంవోయూ అయిన టూరిజం ఇన్వెస్టర్లతో సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ భేటీ
కలిసి పని చేద్దామని పిలుపు.. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని భరోసా
త్వరితగతిన ప్రాజెక్టులు గ్రౌండ్ చేయాలని సూచన..ఇన్వెస్టర్లు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేసిన పర్యాటక శాఖ బృందం
సమావేశం నిర్వహణ తీరుపై ఇన్వెస్టర్లు ప్రశంసలు
అమరావతి : త్వరితగతిన ప్రాజెక్టులు గ్రౌండ్ చేస్తే ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని, కలిసి పనిచేసి పర్యాటకరంగ పురోగతికి పాటుపడదామని ఎంవోయూ అయిన టూరిజం ఇన్వెస్టర్లతో మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు బుధవారం వెలగపూడి సచివాలయం లోని 5వ బ్లాక్ లో ఇటీవల సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లో ఎంవోయూ అయిన ఇన్వెస్టర్లతో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈఓ ఆమ్రపాలి, టూరిజం అధికారుల బృందం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇన్వెస్టర్లు లేవనెత్తిన పలు సందేహాలను పర్యాటక శాఖ బృందం నివృత్తి చేసింది.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఎంవోయూ కుదుర్చుకున్న ప్రాజెక్ట్ లకు అవసరమైన సమాచారం, ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఇతర శాఖలతో సమస్యలు ఉంటే తాము చర్చించి పరిష్కరిస్తామని ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. త్వరితగతిన ఆర్థికపరమైన భద్రతను సమకూర్చుకోవాలని, బ్రాండింగ్ కంపెనీలతో టైఅప్ అవ్వాలని, త్వరితగతిన ల్యాండ్ పార్సిల్ కి అనుగుణంగా డీపీఆర్ లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ల్యాండ్ అందుబాటులో లేని పక్షంలో ప్రైవేట్ ల్యాండ్ అయినా కొని ప్రాజెక్ట్ లు ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. పర్యాటక వృద్ధి తమ అంతిమ లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల నేపథ్యం, బ్యాక్ గ్రౌండ్, నెట్ వర్త్ తదితర అంశాలను ఆరా తీశారు. అన్ని డాకుమెంట్స్ సిద్ధం చేసుకుంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ లో ముందుకు వెళ్దామని పేర్కొన్నారు. కేబినెట్ లో అనుమతులు పొందిన అనంతరం ప్రాజెక్ట్ లు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ అధికారుల స్పందనపై ఇన్వెస్టర్లు ప్రశంసించారు.. తమకు పర్యాటక శాఖ అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల పర్యాటక శాఖతో సమన్వయంతో పాటు తమకు ఉపయోగకరంగా ఉందని అన్నారు.
సమావేశంలో టూరిజం శాఖ ఈడీ (ప్రాజెక్ట్స్) శేషగిరిరావు, ఏపీ టూరిజం అథారిటీ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, కన్సల్టెంట్ సత్యప్రభ, హన్వికా బిజ్ క్రాఫ్ట్, సన్ క్యాస్టిల్, నాంది, హయాగ్రీవ హోటల్స్, రజత్ ఇంటర్నేషనల్, చైతన్య గ్రూప్, త్రయివింగ్ వెకేషన్ రీట్రీట్స్, కే. ఎస్. ఎన్ కన్స్ట్రక్షన్, వీరాంజనేయ రిసార్ట్స్, సూర్య నమస్కార, జలవిహార్ రిసార్ట్స్, అరక్ పవర్ పైనీర్, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్, ఓం శ్రీ భావన సాయి, బ్రహ్మరాభ, ఎలిక్సిర్ ఎంటర్ ప్రైసెస్ అండ్ హోటల్స్, రిసార్ట్స్, సైవెన్ హాస్పిటలిటీ గ్రూప్, ఎన్ ఎం ఆర్ ఫిల్మ్ సిటీ, తత్వవనం ప్రైవేట్ లిమిటెడ్, అబ్ సింకా హోటల్స్, పీవీ ఆర్, కేబీ ఆర్ హాస్పిటాలిటీ అండ్ రిసార్ట్స్, వరుణ్, రాపిడో, జీఆర్టీ హోటల్స్ తదితర 30కిపైగా సంస్థల నుండి ఔత్సాహిక ఇన్వెస్టర్లు పాల్గొన్నారు.


