ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకు కృతజ్ఞతలు
ప్రేమ, విశ్వాసంతో, ఐక్యతతో ఈనెల 15న తణుకులో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలకు తణుకు ప్రాంత పాస్టర్లు బుధవారం ఆహ్వానం అందజేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమం తణుకులోని జూబ్లీ బ్రిడ్జి (ఎస్‌ఎన్‌వీటీ కాలేజీ సమీపంలో) వద్ద నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వేడుకల నిర్వహణకు అత్యంత కీలకంగా సహకరించిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధా కృష్ణకు తణుకు మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీ బ్రిడ్జి సమీపంలో గ్రౌండ్‌ను ఈ క్రిస్మస్ వేడుకల కోసం ఉపయోగించుకునేలా గత ఏడాది సైతం ప్రత్యేకంగా సహాయం చేసినందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాల కోసం తణుకులో ప్రత్యేక గ్రౌండ్ కేటాయింపునకు ప్రయత్నిస్తున్నందుకు క్రైస్తవ సమాజం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ క్రిస్మస్ ప్రేమ కార్యక్రమం ద్వారా ప్రేమ, శాంతి, ఆనందం తణుకు అంతటా వ్యాపించాలని దైవసేవకులు ప్రార్థిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పాస్టర్ మనోజ్బాబ్ ఒరిగేటి, పాస్టర్ ఐజాక్ బ్రెన్హమ్ పెద్దపాటి, పాస్టర్ బ్లెస్సింగ్ రాజు ఖండవల్లి, పాస్టర్ శామ్యూల్ రాజు కొప్పాక, పాస్టర్ డేవిడ్ బాబు కోలాటి, పాస్టర్ రెడ్డియ్య ఆకుమర్తి, పాస్టర్ కృపావరం సిర్రా, పాస్టర్ జాషువా గంజా, పాస్టర్ యేసు రత్నం బిలాని నాయకులు పాల్గొన్నారు.


