తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి సైన్స్ ఫెయిర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తేతలి నందు జీవశాస్త్ర సహాయకునిగా పని చేయుచున్న బి.యం.గోపాలరెడ్డి మార్గదర్శకత్వంలో మధ్యాహ్నపు సంజన, జొన్నాడ దివ్యలు రూపొందించిన ” ఆపరేషన్ గోదావరి” అనే సైన్స్ ప్రాజెక్ట్ జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. నదులు, కాలువలు, చెరువులలో తెలియాడే చెత్తాచెదారాలను వాటర్ క్లీనింగ్ మిషన్ తో ఎలా తొలగించవచ్చో వివరించే వర్కింగ్ మోడల్ రూపొందించిన సంజన దివ్యలను, గైడ్ టీచర్ గోపాల రెడ్డిని, మండల విద్యాశాఖ అధికారులు మురళీసత్యనారాయణ, ఆంజనేయులు, తేతలి ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాదు అభినందించారు.


