నిడదవోలు నియోజకవర్గం వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ జి.శ్రీనివాస్ నాయుడు ప్రెస్ మీట్ లో మాట్లాడి, నియోజకవర్గంలోని సేకరించిన 56114 వేల సంతకాలను వాహనాలకు పంపే జెండా ఆవిష్కరణ చేశారు. నిడదవోలు నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ఐ లవ్ యు నిడదవోలు నుండి నంగాలమ్మ గుడి, గాంధీ బొమ్మ సెంటర్, పాటిమీద గణేష్ సెంటర్ నుండి ఓవర్ బ్రిడ్జి సమిశ్రగూడెం గ్రామం మీదుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్రం కార్యాలయానికి పంపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు, కొవ్వూరు వైఎస్ఆర్సిపి పార్టీ పరిశీలకులు గిరిజాలబాబు, నిడదవోలు పట్టణ అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్లు, జిల్లా వ్యవసాయం సలహా మాజీచైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వివిధ అనుబంధాల విభాగం అధ్యక్షులు, వివిధ గ్రామ వైస్సార్సీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు భారీఎత్తున పాల్గొన్నారు.


