తణుకు బ్రాంచ్లో బీమాసఖి మొదటి వార్షికోత్సవ సంబరాలు

మహిళా సాధికారత లో భాగంగా ప్రధానమంత్రి మోడీ చే డిసెంబర్ 9 వ తేదీ 2024 న ప్రారంభించబడిన బీమాసఖి స్కీమ్ మొదటి వార్షికోత్సవం సంబరాలు డిసెంబర్ 9వ తేదీ మంగళవారం తణుకు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎల్ఐసి రాజమండ్రి డివిజన్ సేల్స్ మేనేజర్ ఎన్ఎస్ఎస్ శర్మ భీమా సఖిలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా ఎదగాలని మన ప్రధానమంత్రి మోడీ ఆలోచనకు కార్యరూపమే ఈ బీమా సఖీలు అన్నారు. ఈరోజు మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా బీమాసఖి లు అందరకు హార్దిక శుభాకాంక్షలు మీరు అద్భుతంగా రాణించి మరింత ఎదుగుతూ ఆర్థికంగా బలోపేతం కావాలని తద్వారా మీ కుటుంబం కూడా ఉన్నత స్థానానికి చేరాలని ఎల్ఐసి టీం రాజమండ్రి కోరుకుంటున్నది అన్నారు. అదేవిధంగా వారికి వెన్నంటి చేయూతనిస్తున్న వారి భర్తలకు, బ్రాంచి సిబ్బందికి, డెవలప్మెంట్ ఆఫీసర్లకు, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్లకు,
అందరకు కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు అన్నారు. ఈ సందర్భంగా తణుకు ఎల్ఐసి బ్రాంచ్ లో బీమాసఖిలుగా జాయిన్ అయి ఉత్తమ పనితీరు కనపర్చిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నెంబర్ ఆఫ్ పాలసీల్లో ఐదవ స్థానంలో నిలిచిన చిటికెన దుర్గాభవాని ని ఆమె మార్గదర్శకుడు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ సలాది ఉదయభాస్కరరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తణుకు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కెఎస్ఎస్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ బి. దుర్గాప్రసాద్, డివోలు లక్ష్మణ్, దేవి, గంగరాజు, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ సలాది ఉదయభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link