తీపర్రులో స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా

ఆర్టిఏ నిబంధనలకు అనుగుణంగా స్కూల్ బస్సులు లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరిక

స్కూల్ బస్సులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ

పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక

నిడదవోలు : పెరవలి మండలం తీపర్రులో స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. విజయవాడ పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ కు తీపర్రు గ్రామంలో ఏటిగట్టు పై నుండి ఉదయం తాడిపర్రు జ్యోతి కాన్వెంట్ స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి బోల్తా పడిందని తెలియగానే
ఈ విషయంపై వెంటనే స్పందించి వాకబు చేసారు. అనంతరం స్వల్ప గాయాలతో స్కూల్ పిల్లలందరూ క్షేమంగా బయటపడ్డారన్న వార్త తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సంబంధిత యాజమాన్యంతో, అధికారులతో మాట్లాడారు. గాయపడిన చిన్నారులకు తక్షణ వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. తక్షణమే అధికారులను ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించమని ఆదేశించారు.
ప్రమాదాలు జరగకుండా వాహనాన్ని సకాలంలో మరమ్మతు చేయించాలని స్కూల్ యాజమాన్యానికి సూచించారు. స్కూల్ బస్సులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.ఆర్టిఏ నిబంధనలకు అనుగుణంగా స్కూల్ బస్సులు లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్కూల్ యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రమాదం జరిగినప్పుడు బయటకు వెళ్లడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఉండాలని, వాటి వాడకంపై పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్రైవర్లకు సరైన శిక్షణ, నిర్దిష్ట రూల్స్ పాటించడం పై అవగాహన కల్పించాలని ఆదేశించారు.. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే స్కూల్ బస్సుల్లో ఏదైనా లోపం కనిపిస్తే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.తల్లిదండ్రులు సైతం పిల్లల్ని స్కూలుకు బస్సుల్లో పంపించేటప్పుడు ఆయా బస్సుల పరిస్థితిని కూడా గమనించాలన్నారు. ఏదైనా లోపాలు ఉంటే సంబంధిత కళాశాలకు, పాఠశాలలకు వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతామంటే చూస్తూ ఊరుకోమని మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Scroll to Top
Share via
Copy link