రూ. 3 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం
నిడదవోలు: రూ. 3 కోట్ల వ్యయంతో నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని కానూరు-ఉసులుమర్రు సిసి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు త్వరితగతిన పనులు పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి దుర్గేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లకు సరికొత్త రూపు రానుందని, వాహనదారుల కష్టాలకు చెక్ పడుతుందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


