శారీరక దృడత్వం, మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
..రాష్ట్ర విద్యుత్ శాఖ,జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్.
ఆదివారం తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద తణుకు రన్నర్స్ సొసైటీ భాగస్వామ్యంతో, స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన తణుకు రోడ్డు రన్ 10 కె, 5 కె, 3కె కార్యక్రమానికి ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
తణుకు రోడ్డు రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఆర్డిఓ ఖతీబ్ కౌసర్ భానో, మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ దేశప్రధాని నరేంద్రమోదీ సంకల్పించిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తణుకు రన్నర్స్ సొసైటీ భాగస్వామ్యంతో నేడు తణుకులో ఇంత పెద్ద పెద్ద ఎత్తున తణుకు రోడ్డు రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వైజాగ్ లో దేశంలో ఎక్కడా జరగని విధంగా ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందన్నారు. మన ముఖ్యమంత్రి సంకల్పించిన ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్షసాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఇల్లు, గ్రామం, పట్టణం పరిశుభ్రంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం అన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం కేటాయించాలన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తణుకు రోడ్డు రన్ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై దృష్టి పెట్టాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఒక నెలరోజుల పాటు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతిరోజు యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నేడు తణుకు రోడ్ రన్ స్ఫూర్తితో ప్రతిరోజు యువత ఫిట్నెస్ కోసం కొంత సమయాన్ని కేటాయించాలన్నారు.
తణుకు,శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు రన్నెర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 3కె, 5కె, 10కె విభాగాల్లో ఈ రోడ్ రన్ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. తణుకు పట్టణం క్లీనర్, గ్రీనర్, హెల్దీయర్ గా ఉండటంతోపాటు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రెండవసారి నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 2,500 మంది యువత ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధనకు ఇటువంటి కార్యక్రమాలు దోహద పడతాయన్నారు.
తణుకు రోడ్డు రన్ కార్యక్రమంలో 3కె రన్ విభాగం రన్నింగ్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఆర్డిఓ ఖతీబ్ కౌసర్ భానో పాల్గొన్నారు.
తణుకు రోడ్డు రన్ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజలు, రోడ్ రన్ నిర్వాహకులు విశ్వతేజ, సాయిదీప్తి, కృష్ణకిరణ్, వినయ్‌పవన్ తదితరులు పాల్గొన్నారు.


