అందజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తణుకు నియోజకవర్గంలో మినీ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పని చేస్తున్న ఆరుగురు సిబ్బందికి మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదోన్నతి ఉత్తర్వులను శనివారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరికి ఉత్తర్వులను అందజేసి అభినందించి మాట్లాడారు. గతంలో రూ. 7 వేలు ఉండే వేతనం ప్రస్తుతం రూ. 11,500 వస్తుందన్నారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన భవనాలను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు.


