రాజ్యాంగ విలువలకు విస్తృత ప్రచారం – తణుకు పౌర సమాజ సంస్థల నిర్ణయం


తణుకు పట్టణంలో పౌరసమాజ సంస్థలు, కార్మిక సంఘాలు , ప్రజా సంఘాలు తమ సంఘాల సభలు సమావేశాల ద్వారా రాజ్యాంగ విలువలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఈ రోజు స్థానిక సురాజ్య భవనంలో జరిగిన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు.
డా అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా “ డా అంబేద్కర్ స్ఫూర్తి- రాజ్యాంగ విలువలు“ అంశంపై రాజ్యాంగ ప్రచార వేదిక నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకుంది .
పట్టణంలోని పలు పౌరసమాజ సంస్థలు , కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు ప్రతినిధుల తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ప గో జిల్లా ప్రచార వేదిక కన్వీనర్ డి వి వి యస్ వర్మ అధ్యక్షత వహించారు.
అయన మాట్లాడుతూ రాజ్యాంగానికి పొంచివున్న ప్రమాదాలను డా అంబేద్కర్ 1949 లో నవంబరు 26 చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారని తెలిపారు,
పాలకులు రాజ్యాంగ బద్ధంగా ప్రజల సమస్యలు పరిష్కరించక పోయినప్పుడు, ప్రజలకు సామాజిక, ఆర్ధిక న్యాయం కల్పించక పోయినప్పుడు ప్రజలు రాజ్యేగంతర పద్ధతులకు మొగ్గు చూపినప్పడు రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అలాగే రాజకీయాలలో నాయకుల ఆరాధన వ్యక్తి పూజ తో ప్రజలు అంధ భక్తులు గా మారితే నియంతలు పుట్టుకొస్తారని, స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేయబడితే రాజ్యాంగం రూపంలో మిగిలినా సారంలో రాజ్యాంగం పతనమౌతుందని , రాజ్యాంగం ఎంత మంచిదైనా పాలకులు చెడ్డవారైతే అది చెరుపు చేస్తుందని డా అంబేద్కర్ చేసిన హెచ్చరికలను గుర్తు చేసుకుని రాజ్యాంగ పరిరక్షణ కు పూనుకోవాలని వర్మ విజ్ఞప్తి చేశారు.
సామాజిక న్యాయ పోరాట సమితి అధ్యక్షుడు పేరూరి మురళీ కుమార్ రాజ్యాంగ పీఠిక ప్రకటించిన సామ్యవాదం, లౌకిక తత్వం, స్వేచ్ఛ ,సమానత్వం , సౌభ్రాతృత్వం విలువల ప్రాధాన్యతను వివరించారు.
వేదిక కన్వీనర్ డా రమేష్ చంద్ర బాబు దేశంలో రాజ్యాంగం పై సాగుతున్న దాడులను ప్రస్తావించారు
వివిధ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ రాజ్యాంగ విలువల ప్రచారం ఆవశ్యకతను నొక్కి చెబుతూ తమ సంస్థల లో ప్రచారం సాగిస్తామని ప్రకటించారు
ఈ సమావేశంలో పి వి ప్రతాప్, సి ఐ టి యు- బొద్దాని నాగరాజు , ఎ ఐ టి యు సి –
ఆకుల వెంకటేశ్వర రావు, మాజీ మున్సిపల్ చైర్మన్-అడ్డాల సత్యనారాయణ, కరుణాకర చౌదరి సీనియర్ సిటిజన్స్- ఎన్ అప్పల రాజు , పెన్షనర్స్ – చీకటి శ్రీనివాసరావు , లయన్స్ క్లబ్ – డా ముప్పన రఘు , డా వంక రామదాసు , ఐ యం ఎ-
ఆలపాటి సుబ్బారావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, మానవత సంస్థ-గొల్లపల్లి అంబేద్కర్ , సామాజిక న్యాయపోరాట సమితి, కామన మునుస్వామి , ఇండియన్ లాయర్స్ యూనియన్- కొండే నాగేశ్వర రావు – అంబేద్కర్ భవనం- ఫాదర్ జగజ్జీవన్- సంకు మనోరమ , ఎ అజయ కుమారి – కొవ్వలి ఆంజనేయ శర్మ,అంబటి రామకృష్ణ
వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు గార రంగారావు, పి బ్రహ్మాజీ -సబ్బితి వరప్రసాద్-బెజ్జవరపు సత్యనారాయణ, యం ముత్తయ్య, అర్జి భాస్కరరావు , సి హెచ్ దుర్గా ప్రసాద్, ఇ రమేష్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link