ఇందిరా గాంధీ 108 జయంతి సందర్భంగా నిడదవోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజవర్గం ఇంచార్జ్ మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసినారు ఈ సందర్భంగా ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గొప్పతనం గురించి కొనియాడారు ఒక మహిళగా ఈ దేశాన్ని పరిపాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిగా విభిన్నమైన పథకాలను ప్రవేశపెట్టినారు బడుగు బలహీన వర్గాలకు సమపాలన చేసి ఉన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ జిల్లా ST సెల్ చైర్మన్ బండి అభిషేక్రుడు భావన రమేష్ షేక్ బషీర్ కాకి కిషోర్ వంగూరి వెంకన్న పెంచేటి ధరణి పతి మహమ్మద్ అన్వర్ ఖాన్ కళ్లెం ఆనందరావు శ్రీను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


