ఆల్ ది బెస్ట్ కైవల్య

అంతరిక్ష యాత్రకు ఎంపికైన కైవల్య రెడ్డికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు

నిడదవోలు టౌన్ రోటరీ ఆడిటోరియంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన ఆస్ట్రోనాట్ అభ్యర్థి కుంచాల కైవల్య రెడ్డి

ఫ్లోరిడాలోని ‘టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్’ నుండి అందుకున్న లెటర్ ను పరిశీలించిన మంత్రి దుర్గేష్

నిడదవోలు : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా రెడ్డి నాసా ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ)కి ఎంపిక కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. కుంచాల కైవల్య రెడ్డి తన తల్లిదండ్రులతో పాటు బుధవారం మంత్రి కందుల దుర్గేష్ ను నిడదవోలు టౌన్ రోటరీ ఆడిటోరియంలో కలిశారు. ఈ సందర్భంగా తాను సాధించిన రికార్డులను కైవల్య మంత్రి దుర్గేష్ కు వివరించగా చిన్న వయస్సులోనే ప్రతిభ చాటుకొని పదుల సంఖ్యలో రికార్డులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కైవల్య ఎంపిక నిడదవోలుకే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు, దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని ‘టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్’నుండి కైవల్య కు అందిన లెటర్ ను పరిశీలించారు.

Scroll to Top
Share via
Copy link