యస్.కె.యస్.డి. మహిళా కళాశాల ఆధ్వర్యంలో గోటేరు గ్రామములో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేకశిబిరం

స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల యుజీ అండ్ పిజీ (అటానమస్) జాతీయ సేవా పథకం గోటేరు గ్రామములో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ జె. కిషోర్ మాట్లాడుతూ ఎన్.ఎస్.ఎస్ విభాగమువారు ఈ స్పెషల్ క్యాంప్ నిర్వహించడానికి తమ పూర్తి సహకారం అందిస్తానని తెలియజేశారు. ఎన్.ఎస్.ఎస్.వాలంటీర్లని అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ మాట్లాడుతూ వాలంటీర్లు అంకిత భావంతో పని చేయాలని పేర్కొన్నారు. ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేకతను గ్రామ ప్రజలకు తెలియజేశారు.

తదుపరి ఎన్.ఎస్.ఎస్. విభాగం ఈ ప్రత్యేక క్యాంప్లో భాగంగా మొదటి రోజు ముళ్లపూడి వెంకటరమణ మెమోరియల్ హాస్పటల్ (ట్రస్టు) వారితో కలసి గుండె మరియు కంటికి సంబంధించిన సమస్యలపై ఉచిత వైద్య శిబిరము నిర్వహించారు. ఈ, వైద్య శిబిరంలో డా॥ జి.ఎస్.పాత్రుడు, కార్డియాలజి (కిమ్స్, బొల్లినేని, రాజమహేంద్రవరం) శ్రీమతి ఎం. అశ్విని, ఆప్తమాలజిస్ట్, (కిమ్స్, బొల్లినేని, రాజమహేంద్రవరం) పలువురు గ్రామ ప్రజలు యొక్క గుండె మరియు కంటి సమస్యలను పరీక్షించి సూచనలు, సలహాలు మరియు ఉచితముగా మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్స్, సి.హెచ్. రమేష్ బాబు, శ్రీమతి కె.వి. శ్యామలదేవి ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link