గీత వృత్తి రక్షణ బాటకు అఖిలపక్షం మద్దతు ఇస్తుందన్నారు. ఆదివారంనాడు తణుకులో అమరవీరుల భవనంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కామన మునిస్వామి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని గీత వృత్తి కాపాడుటకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినారు. ముందుగా సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తిగా నరసింహమూర్తి మాట్లాడుతూ గీత వృత్తిలో కార్మికుల సమస్యలను తెలియజేస్తూనే నేడు కూటమి ప్రభుత్వము గీత కార్మిక పట్ల వ్యతిరేక విధానాలను సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతున్న ప్రభుత్వము సోధ్యం చూస్తు ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉందని అన్నారు. రోజుకు ఒక్కొక్క బ్యాటరీ నుండి కల్తీ మద్యం 30 వేల లీటర్లు తయారవుతుందని దానిని రాష్ట్రంలో ఇచ్చిన విడిగా అమ్ముచున్నారని అన్నారు. దీనిపై సీబీఐ ఎంక్వయిరీ ఏసి దోషులపై పిడి యాక్ట్ నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్సార్ సిపి తణుకు పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా మద్యాన్ని విక్రయించేదని నేడు ప్రజాప్రతినిధులే బెల్ట్ షాపులు నిర్వాణకు డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. గీత కార్మికులు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషన్, ఆదరణ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శేషగిరి డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు బోద్దాని నాగరాజు కలిగితే వృత్తి సాంప్రదాయకమైన వృత్తిని తరతరాల నుండి ఆ వృత్తిపై లక్షలాదిమంది గీత కార్మికులు వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని అటువంటి కార్మికుల పొట్టను కొడితే చూసి ఊరుకునేది లేదని గతంలో పథకాలన్నీ వారికి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైయస్సార్ సిపి లీగల్ సెల్ అధ్యక్షులు వెలగల సాయిబాబా రెడ్డి మాట్లాడుతూ తనుకు నియోజవర్గంలో ఇచ్చలివిడిగా బెల్ షాపులు ద్వారా మద్యాన్ని విక్రయిస్తున్నారని గతంలో ఈ విధoగా ఉండేది కాదని అన్నారు. ఎక్సైజ్ అధికారులను సమాచార హక్కు చట్ట ప్రకారము నియోజకవర్గంలో ఎన్ని లైసెన్స్శషాపులు ఉన్నవి, బెల్ట్ షాపులు ఎన్ని అని అడగ్గా లైసెన్స్ షాపులు 22 ఉన్నవని, బెల్ట్ షాపులు నియోజవర్గంలో ఎక్కడ లేవని సమాధానాన్ని ఇచ్చారని దీనిని చూస్తేనే ప్రభుత్వం అధికారులు చేత ఏ విధంగా మోసపూరితంగా సమాచారాన్ని ఇస్తుందని తెలుస్తుందని అన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం నిర్వహించే పోరాటాలకు వైఎస్ఆర్సిపి పూర్తిగా మద్దతును ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పి.వి ప్రతాప్ మాట్లాడుతూ గీత కార్మికులు వృత్తికి ప్రభుత్వం సమగ్రమైన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘం నాయకురాలు అడ్డగర్ల అజయ్ కుమారి మాట్లాడుతూ గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉండడం వలన మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
బెల్ట్ షాపులను రద్దు చేసే వరకు మహిళా సంఘo ఆధ్వర్యంలో పోరాటాలను విస్తృతం చేస్తామని తెలిపారు .సామాజిక పోరాట సమితి వ్యవస్థాపకులు మురళి మాట్లాడుతూ కార్మికుల చెప్పినట్టు వినాలంటే ఐక్య పోరాటాలే శరణమని వాటిని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చేది బిక్ష అని కార్మికులు పోరాటం ద్వారా సాధించుకునేవి వారి యొక్క హక్కుని అన్నారు. గీత కార్మికులు నిర్వహించే అన్ని పోరాటాలకు అఖిలపక్ష నాయకులు సహకారం ఉంటుందని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హామీ ఇచ్చారు .ఈ సమావేశంలో గీత కార్మిక నాయకులు కడలి పాండు, మామిడి చెట్టు నాగభూషణం ,గారా రంగారావు దాసరి సూరిబాబు, కడలి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


