తణుకులో న్యాయవాది పొట్ల సురేష్ అధ్యక్షతన మాల సంఘాల జే.ఎ.సి. సమావేశం జరిగింది. సమావేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక కులాన్ని టార్గెట్ చేసి అణిచివేసే ప్రయత్నం చేస్తుందని అభిప్రాయ పడింది. దానికి నిదర్శనంగా 2011జనాభా లెక్కలు తీసుకుని 2024ఉద్యోగాలు లెక్కవేసి, ఓపెన్ లో వచ్చిన మాల అభ్యర్థులని కులానికి లెక్కలు వేసి మాలలు జనాభాకి మించి ఉన్నారని తప్పడు వర్గీకరణ చేసిందని, మాలలపై రోజు దాడులు జరుగుతున్న నిర్లక్ష్యం చేస్తుందని, గుంటూరు జిల్లా తురకపాలెంలో మాలలు గత రెండు నెలల్లో 30మంది మరణిస్తే కనీసం స్పందన లేదని, చావులకి కులాల ఆరోహన, ఎవరోహనా క్రమంలో నష్టపరిహారం ప్రకటించడం ఇవ్వన్నీ మాలలపై ప్రత్యక్ష అణిచివేత కి నిదర్శనం అని సమావేశం కండించింది. ప్రభుత్వ నిష్క్రీయ పరాత్వాన్ని ఎదుకోవడానికి, ఉమ్మడి పశ్చిమగోదావరిలో ఉన్న అన్ని మాల సంఘాలు ఏకమై జే.ఎ.సి.గా ఏర్పడి డిసెంబర్ 13 న తాడేపల్లిగూడెంలో భారీ సదస్సు నిర్వహించడం జరుగుతుందని సమావేశం తెలిపింది. నిర్మాణంలో భాగంగా తణుకు నియోజకవర్గం స్థాయి జే.ఎ.సి.ఏర్పాటు జరిగిందని, జే.ఎ.సి. చైర్మన్ గా దాయం అర్జున్, కో చైర్మన్ లుగా మద్దిల ఏసు, భావన రాము, జంగం సురేషబాబు, విజయ్ లు, జే.ఎ.సి. ప్రధాన కార్యదర్శి రొట్టె రవి, సభ్యులు బయ్యే రాజేష్, మహేష్ తదితరులు ఎన్నుకున్నట్లు పొట్ల సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.


