- కలెక్టర్ కీర్తి చేకూరి
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి మంగళ వారం ఒక ప్రకటనలో దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేశారు..
స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమాల స్ఫూర్తితో, సంకల్ప దీక్షతో విజయ దశమి, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా మన ఇంటి నుంచి అన్ని ప్రదేశాలలో స్వచ్ఛత పాటిస్తూ, సామాజిక సేవ ద్వారా విజయం సాధించడానికి ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకోవాలని, జిల్లా ను “సా సా కార్యక్రమం” లో అగ్రభాగాన నిలుపుదామని కోరారు.
జిల్లా ప్రజలందరికీ , వారి కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు, ఆరోగ్యం మరియు సమృద్ధి కలగాలని,అన్నింటా విజయాలు చేకూరాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆకాంక్ష వ్యక్తం చేశారు.


