ఉండ్రాజవరం బెతిన సుబ్బమ్మ వృద్ధుల ఆశ్రమం యందు బుధవారం సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) సందర్భంగా తణుకు కోర్టు న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్ లు వృద్ధులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, కని, పెంచి, ప్రయోజకులను చేసిన ముసలి తల్లిదండ్రులను బాధ్యతగా అవసానదశలో మంచిగా చూసుకోవాలని, వారికి కావలసిన అవసరాలను తీర్చాలని, ఆస్తులు తీసుకుని ముసలి తల్లిదండ్రులను విడనాడితే వారి నుండి చట్ట ప్రకారం ఆస్తులు తిరిగి తీసుకోవచ్చని, అలాగే హోమ్ లో వున్న ముసలివారికి ఆస్తులలో, కుటుంబ సభ్యుల తో సమస్యలు ఉంటే మండల న్యాయసేవల కమిటీ తణుకు వారి ద్వారా ఉచిత న్యాయ సహాయం, సేవలు పొంది సమస్య పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు ముసలి తల్లిదండ్రులను బాధ్యతగా చివరిదశలో మంచిగా చూసుకోవాలని తెలిపారు. ముసలి వారికోసం వృద్ధుల సంక్షేమ చట్టం ఉందని. అలాగే ముసలి వారి కోసం ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్, రవాణారంగం రాయితీలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, హోమ్ లో ఉన్నవారు ఒకరికి ఒకరు సహాయ సహకారాలను అందించుకోవాలని తెలుపుతూ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తణుకు కోర్టు న్యాయవాదులు కామన మునిస్వామి, కౌరు వెంకటేశ్వర్లు, రాజనాల జనార్ధనరావు, అంగజాల అజయ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్ శ్రీ కాకర్ల నరసన్న, ఆశ్రమ నిర్వాహకులు కుదపచక్రపాణి,మల్లిన రాజేంద్రప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.


