అసెంబ్లీలో ప్రస్తావించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకు గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు
అమృత్-2 పథకంలో భాగంగా తణుకు పట్టణనికి గోదావరి నీరు తరలించే గ్రిడ్ మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 118 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ సభను ఉద్దేశించి మాట్లాడారు. తణుకు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ క్రమంలో ప్రతి ఇంటికి గోదావరి నీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 118 కోట్లు కేటాయించడం హర్షణీయమని అన్నారు. 2027 నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించిన రాష్ట్ర మంత్రి నారాయణ ఇచ్చిన సమాధానానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఏ ప్రాతిపదికన 2027 నాటికి పనులు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. మొత్తం ప్రాజెక్టును ఒకే ఏజెన్సీ కు కాంట్రాక్టర్ కు ఇన్నారా లేక తణుకు పట్టణానికి చెందిన ప్రాజెక్టుని ఒక కాంట్రాక్టర్ కు ఇస్తున్నారా స్పష్టం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మున్సిపాలిటీ భాగస్వామ్యం ఉంటుందా నిధులు ఏమైనా చెల్లించాల్సిన పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో కొత్తగా ఎన్ని ట్యాప్ కనెక్షన్లు ఇవ్వబోతున్నాం.. ఎన్ని కిలోమీటర్లు మేర పైపు లైన్లు నిర్మించబోతున్నామనేది తెలియజేయాలని కోరారు. టెండర్ల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది మంత్రి వివరించాలని సూచించారు. దీనిపై రాష్ట్ర మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ తణుకు నరసాపురం నిడదవోలు పాలకొల్లు భీమవరం ఆకివీడు పట్టణాలకు సంబంధించి రూ. 420 కోట్లతో గ్రిడ్ ప్రాజెక్టు మంజూరు అయినట్లు చెప్పారు. తణుకులో 4900 గృహాలకు సంబంధించి కొత్త కనెక్షన్ల కోసం రూ. 81 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అక్టోబర్ 3న క్యాబినెట్లో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుని 2027 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే 30 ఏళ్లలో పెరిగే జనాభాను పరిగణాలలోకి తీసుకుని రూ. 118 కోట్లు వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు.


