స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర లో భాగంగా, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీమతి నాగరాణి , డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఏలూరు శ్రీమతి బి. శ్రీలత ఆదేశాల మేరకు ఈ రోజు తణుకు పట్టణములో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ లలో తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు నివారణకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మద్యం షాపులలో, బార్లలో వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ వంటి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించడం పూర్తిగా మానివేయాలనీ, వాటి స్థానంలో బయో డిగ్రీడబుల్ ఉత్పత్తులు, తిరిగి వాడటానికి పనికి వచ్చే ఉత్పత్తులను ఉపయోగించాలి. తద్వారా ప్లాస్టిక్ రహిత తణుకు నిర్మాణములో పాలుపంచుకోడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందించిన వారు అవుతారని తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠరెడ్డి తెలిపారు. మద్యం, బార్ షాపు యజమానులు తమ మద్యం షాపుల నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా తమ యొక్క ప్రాంగణంలోనే విధిగా చెత్తబుట్టను ఏర్పాటు చేసుకుని వ్యర్ధాలను కేవలం అందులో మాత్రమే వేసే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చూపించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిరోజు విధిగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ – ఇన్స్పెక్టర్లు ఆర్. మధుబాబు, బి. లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.


