అత్తిలి మండలంలో పొలం పిలుస్తుంది

అత్తిలి మండలంలోని బొంతు వారి పాలెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులందరూ కూడా సామూహికంగా ఎలుకల నిర్మూలన చేపట్టినట్లయితే ఎలుకలకు సమర్థవంతంగా నియంత్రించవచ్చని అందుకే రైతులందరూ ఒక మాట మీద ఉండి అందరూ ఒకేసారి ఎలుకల మందు పెట్టినట్లయితే ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని అలాగే ఎలుకలు నియంత్రణకు పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చని తెలియజేశారు. అలాగే రైతులందరూ యూరియా వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే ఈ యూరియా అధిక శాతం మొక్కకు అందకుండా వివిధ రూపాల్లో వ్యర్థంగా పోతుందని కాబట్టి రైతులందరూ నానో యూరియా పట్ల అవగాహన పెంచుకొని నానో యూరియా వినియోగించాలని సూచించడమైనవి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు గాయత్రి, దుర్గ ఏఈఓ శివశేఖర్, కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link