తణుకు మండలంలో దువ్వ, కొమరవరం గ్రామాలలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఉచిత ఎలుకల మందు పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు ఎ.యం.సి. చైర్మన్ శ్రీ కొండేటి శివ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందించే ఎలుకల మందును రైతు సోదరులు అందరు ఉపయోగించుకొని సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో దువ్వ సహకార సోసైటీ చైర్మన్ చిక్కాల వేణు మాట్లాడుతూ రైతుసోదరులు ఎలుకల మందును పంటపోలలోనే కాకుండా పోరంబోకు భూములలో కూడా చేపట్టి ఈ ఎలుకల నిర్మూలనను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని తద్వారా ఎక్కువ దిగుబడి సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి అడ్డా బాబు, తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సిరిగిశెట్టి వెంకటేశ్వరరావు, రైతుసోదరులు పాల్గొన్నారు.


