అరుదైన రికార్డు నెలకొల్పిన నారా దేవాన్ష్‌

అభినందించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ తనయుడు నారా దేవాన్ష్‌ మరో అరుదైన ఘనతను సాధించడం పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ హాలులో జరిగిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించినట్లు చెప్పారు. వేగవంతమైన చెక్‌ మేట్‌ సాల్వర్‌–175 పజిల్స్‌లో ప్రపంచ రికార్డు అందుకున్నారని అన్నారు. సవాళ్లను పరిష్కరించి చెక్‌మేట్‌ సాల్వర్‌గా దేవాన్ష్‌ ప్రపంచ రికార్డు సాధించడం గర్వకారణమన్నారు. గతంలో చెక్‌ డొమైన్‌లోనూ మరో రెండు నెలకొల్పిన దేవాన్ష్‌ సాధించిన రికార్డు పట్ల రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to Top
Share via
Copy link