కార్పొరేటర్ మహ్మద్ సాదిక్ ప్రశ్నల వర్షం
విశాఖపట్నం: ఆగష్టు 23 (కోస్టల్ న్యూస్)
జివిఎంసి కార్పొరేటర్లు భద్రత గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్ కి పట్టడం లేదంటూ 39వార్డు కార్పొరేటర్ మాజీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ మహమ్మద్ సాదిక్ ఆవేదన వ్యక్తంచేశారు. నగరంలోని ద్వారాకనగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే జీవీఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్ కి సిద్ధం అయ్యారని కానీ గతంలో టూర్ కాంట్రాక్టర్ గా వ్యవహరించిన సదరన్ ట్రావెల్స్ మేనేజర్ గా పనిచేసిన రమణ కు మరోసారి టూర్ బాధ్యతలు అప్పగించారని గతంలో వెళ్లిన స్టడీ టూర్స్ లో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. గతంలో వెళ్లిన 4 స్టడీ టూర్స్ కు కాంట్రాక్టు రమణ కె అప్పజెప్పారు కానీ హిమాచల్ ప్రదేశ్ లో బస్సుకు ప్రమాదం జరిగి 13గంటలు నరకయాతన పడ్డాం అని గుర్తు చేశారు. నర్న్సారి కూడా బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కార్పొరేటర్ లు అందరూ భయబ్రాంతులకు గురయ్యారన్నారు.
ఇప్పుడు మరోసారి స్టడీ టూర్ కి సురక్షిత కరువయ్యిందన్నారు. ప్రమాదం గురైనప్పుడు కాంట్రాక్టర్ రమణ తో పాటుగా వారి సిబ్బంది కూడా ఫోన్ కాల్ కి స్పందించేవారు కాదన్నారు అలాంటి పరిస్థితుల్లో
గత కమిషనర్ సంపత్ కుమార్ హయాంలో విమానంలో వచ్చాం అన్నారు. గతంలో ప్రస్తుత మేయర్ పీలా శ్రీనివాస్ రావు ఇదే కాంట్రాక్టర్ రమణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ కి ఫిర్యాదు కూడా చేసారు ఆయన్ని కొనసాగించకూడదు ఆయన్ని మార్చాలంటూ కౌన్సిల్ సమావేశాల్లో ప్లకార్డులు పట్టుకున్నారు. ఇప్పుడు మేయర్ గా బాధ్యతలు చేపట్టాక మరల అదే కాంట్రాక్టు కి ఎందుకు టూర్ బాధ్యతలు అప్పగించారో దానివెనుక ఉన్న మర్మమేమిటి అని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్ మారుస్తాం అని 2024 లో అప్పటి మేయర్ కు స్రవంతి ట్రావెల్స్ కి మార్చాలి అని వినతి పత్రం ఇచ్చాం. గతంలో ఈ కాంట్రాక్టర్ ను విమర్శించిన పీలా శ్రీనివాసరావు ఇప్పుడు ఇతనికే కాంట్రాక్ట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. స్వంతంగా స్రవంతి ట్రావెల్స్ నిర్వహణలో కొందరు కార్పొరేటర్లు రమణకు వత్తాసు పలుకుతున్నారని
కమిషనర్ స్పందించి రమణను దూరం పెట్టాలన్నారు. గతంలో అవినీతి జరిగిందని చెప్పిన మేయర్ ఇప్పుడు అదే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వడం దారుణం అని కార్పొరేటర్ల భద్రత మీద లెక్క లేదా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన కౌన్సిల్ భోజనాలు కూడా నాసిరకంగా ఉన్నాయని ఈ భోజనం తరువాత అనారోగ్యానికి గురయ్యాను అన్నారు. ఇలాంటి విషయాల్లో కమిషనర్ దృష్టి సారించాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎస్ కూడా లేఖలు రాస్తాన్నారు.


