సమస్య ఉంటే కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి
విశాఖపట్నం: ఆగస్టు 19 (కోస్టల్ న్యూస్)
ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు ముప్పు ప్రాంతమైన ఎర్రిగెడ్డలో పూడిక తీసే పనులను వైయస్సార్సీపి వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ మరొకసారి పర్యవేక్షించారు. వర్షం ఆగి ఆగి పడటం వల్ల వరద ఉద్ధృతి తగ్గిందని ఏ సమయంలోనైనా పెద్ద వర్షం కురిస్తే గెడ్డ పొంగే అవకాశం ఉందని అన్నారు. కావున ప్రత్యేక సిబ్బందిని తుఫాను తీరం దాటి వెళ్లే వరకు అందుబాటులో ఉంచి పని చేయించాలని, అలాగే సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని మేయర్, జీవీఎంసీ కమిషనర్ ను కోడిగుడ్ల శ్రీధర్ కోరారు. లేనిది ఉన్నట్లుగా నిరూపించడం కంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలని అన్నారు. తుఫాను తీరం దాటి వెళ్లే వరకు ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆటో అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్న 78158 05124 నెంబర్ కి వాట్సప్ మెసేజ్ ద్వారా తెలియజేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తామని కోడిగుడ్ల శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ లు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్యదర్శి వేలంగణి రావు, వి. కిషోర్ భవానీ తదితరులు పాల్గొన్నారు.


