పెదవేగిలో నేత్ర సంరక్షణ కేంద్రం ఏర్పాటు

భూమి పూజలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

దాతలను అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రజలకు అందుబాటులో పెదవేగిలో ఏర్పాటు చేయనున్న నేత్ర సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. దెందులూరు మండలం పెదవేగిలో సోమవారం కేంద్ర ఏర్పాటుకు సంబంధించి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సొంత ఊరు ప్రజల కోసం కోట్లాది రూపాయలను విరాళంగా అందిస్తున్న కాసరనేని దమయంతి రాజు దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఒక మంచి సంకల్పంతో 2026–27 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ నేత్ర సంరక్షణ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు. నేత్ర సంరక్షణా కేంద్రానికి దాదాపు రూ. 10కోట్లు విలువైన భూమిని , రూ. 2కోట్ల నగదును విరాళంగా అందించిన మాజీ ఐఏఎస్‌ అధికారులు కాసరనేని రాజు, దమయంతి దంపతులను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేడీ శీలం, జార్ఖండ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జీ కె.రాజు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link