గురువారం నిడదవోలు రోటరీక్లబ్ నందు నిడదవోలు నియోజకవర్గ వై.యస్.ఆర్.సీపీ మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు అధ్యక్షతన
” బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” నిడదవోలు నియోజకవర్గం విస్తృత స్థాయి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా తెలుగుదేశం, జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఊటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేస్తున్న మోసాలను ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్యదేశమని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు, రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి శ్రీనివాస్, వై.యస్.ఆర్.సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా, వై.యస్.ఆర్.సీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి గిరిజాల బాబు, నిడదవోలు పట్టణ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులు, నిడదవోలు పట్టణ, నిడదవోలు పెరవలి ఉండ్రాజవరం మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ నాయకులు, నిడదవోలు నియోజకవర్గ పార్టీ నాయకులు, ఎంపీపీ, జడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు వైఎస్ఆర్సిపి నాయకులు, వివిధ గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.


