నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాలమేరకు సమిశ్రగూడెం తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్ గోగిన శ్రీనివాసరావు (లాలి) ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు 75 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్రిస్టియన్ దేవాలయాలలోను, హిందూ దేవాలయాలలోనూ ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహించి స్వీట్స్ పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


