నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ టిడిపి నాయకులు పెండ్యాల గోవిందు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ లీడర్ సుధీర్ సూరయ్య, వీరయ్య రమణయ్య, గారపాటి సురేష్ మాణిక్యం కోటియ్య అగ్గి రాముడు, కాసగాని రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.


