ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు 75 పుట్టినరోజు సందర్భంగా పాలంగి గ్రామంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి ఉదయ్ కుమార్ (భాను) నాయకత్వంలో చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలంగి గ్రామంలో కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మజ్జిగను చలివేంద్రం ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో ఈడుపుగంటి భాను, చిడిపోతూ సింహాచలం, గన్నమని రామారావు, కరుటూరి శ్రీను, కేతా రామారావు, కడలి లక్ష్మణరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


