తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది వేడుకల ఉత్సాహం తణుకు పట్టణంలో ఒక రోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. తణుకు మున్సిపాలిటీ మొదటి మహిళా చైర్ పర్సన్ డాక్టర్ ముళ్ళపూడి రేణుక పదవీ బాధ్యతలు చేపట్టిన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ వేడుకలలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ లు, ఆనాటి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న డాక్టర్ రేణుక, డాక్టర్ హరిబాబు అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. తణుకు పట్టణ మున్సిపాలిటీ ప్రథమ మహిళా మున్సిపల్ చైర్ పర్సన్ గా 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ మహిళ నాయకురాలు వ్యాఖ్యాత బిజెపి నాయకురాలు డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ 25 సంవత్సరాలు గడిచిన గుర్తుంచుకునే విధంగా పరిపాలన అందించడానికి సహకరించిన ఆనాటి పాలకమండలి సభ్యులు రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈరోజు రజితోత్సవ వేడుకను జరుపుకుంటున్నామని ఆమె తెలియజేశారు. తణుకు పట్టణం అంటేనే ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ అనే విధంగా ఆయన తనకు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, పరిచయం అవసరంలేని రాష్ట్రస్థాయి వ్యక్తి హరిచంద్ర ప్రసాద్ అని, తణుకు పట్టణంలో మున్సిపాలిటీలో ప్రధమ చైర్మన్ గా అహర్నిశలు పట్టణాభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే కాకుండా వ్యవసాయ పరంగా ప్రతి కుటుంబం బాగుపడే విధంగా ఆయన ప్రణాళికలు ఉండేవని అన్నారు. తణుకు పట్టణ చరిత్రలో ఏ విషయం లోనైనా హరిచంద్ర ప్రసాద్ మొదలు పెట్టడం వల్లనే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతున్నామని అన్నారు. ఏ పదవి చేసాం, ఎంతకాలం చేసాము అన్నది కాదు, మనల్ని ప్రజలు ఎంతకాలం గుర్తుపెట్టుకున్నారు అన్నదే మన పనితీరుకు ప్రామాణికం అన్నారు. ఆయన సలహాలు సూచనలు అభివృద్ధిలో అయితే నేమి రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలోనూ హరిచంద్ర ప్రసాద్ కనిపిస్తారని అన్నారు. తాను మున్సిపల్ చైర్పర్సన్ గా కావడానికి ప్రముఖ పాత్ర పోషించిన వారిలో ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి బోళ్ల బుల్లి రామయ్య, అందరివాడు రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న మాజీ ఎమ్మెల్యే వైటి రాజా పాత్ర ఎనలేనిదని అన్నారు.
ఈ సందర్భంగా తాడెపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకోట తాతాజి మాట్లాడుతూ డాక్టర్ ముళ్ళపూడి రేణుక చైర్మన్గా చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎవరు పెట్టినా సందర్భాలు అప్పుడున్న కౌన్సిలర్లు అందరిని కూడా కలుపుకుని చేస్తామని చెప్పారు.


