తణుకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం తణుకు నందు మండల పరిషత్ సాధారణ సమావేశము మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రుద్రా ధనరాజు అధ్యక్షతన జరిగింది. సదరు సమావేశములో శాఖలవారీగా సంభందిత శాఖల అధికారులు మండల లో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పదకాలకు సంబందించి మండల ప్రజాప్రతినిధులకు వివరించారు.ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు, సభ్యులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాల ద్వారా తెలిపారు.
ముఖ్య అతిధి ఎం.ఎల్.సి. వంకా రవీంద్ర మాట్లాడుతూ సమావేశానికి చేయవలసిన ఏర్పాట్లు తగినంతగా లేవని, 3నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశాలు ప్రజల సమస్యలు, ప్రజాప్రతినిధులు ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతాలు సమస్యలు అధికారులకు తెలిపే అమూల్యమైన సమావేశానికి గ్రామ సర్పంచులు హాజరు కాకపోవడంపై విస్మయం వ్యక్తంచేశారు. అధికారులు దృష్టికి సమస్యలు తెచ్చి వాటి పరిష్కారానికి కృషిచేయాలని సభ్యులను ఉద్దేశించి అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశాలకు గైర్హాజరు కాకుండా చూడవలసిన బాధ్యత ఉన్నతాదికారులపై ఉందని అభిప్రాయపడ్డారు. అదేవిదంగా పశువులకు భీమా చెయించుకొవడం ద్వారా అనుకోని సంఘటనల వల్ల కలిగే నష్టం నుండి బయటపడవచ్చని అన్నారు. 600 రూపాయల ఖర్చుతో 50వేల పైబడిన పశువులకు భెమా ద్వారా రక్షణ పొందవచ్చని అన్నారు. మండలంలో 10% పశువులకు మాత్రమే భీమ జరగడంపై అందోళన వ్యక్తంచేసారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలో రైతులకు భీమాపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిదంగా లేహ్యం ఫుడ్ పరిశ్రమ వల్ల ప్రజలు తాము పడుతున్న ఇబ్బందులను తెలియజేయడానికి శాంతియుతంగా నిరశన చేస్తే, న్యాయం చేయవలసిన అధికారులు కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమకు కాపలా కాయడం దారుణమన్నారు. అంతేకాక ప్రజావసరాలకు ఉపయోగించే ఆ మాంసం పూర్తి పొల్యూషన్ వెలువరించే ప్రదేశంలో నడపడం, పరిసరాల్లో ఎంతోమంది జీవిస్తూ ఆ పరిశ్రమ కాలుష్యంవల్ల వ్యాధులకు గురౌతున్నారని అన్నారు. అటువంటి పరిశ్రమలు జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ ప్రాంతం ఫుడ్ ప్రొససింగుకి పనికిరాదని తాను ఒక పారిశ్రామిక వ్యక్తిగా చెబుతున్నాని అన్నారు. అదేవిదంగా లేహ్యం ఫుడ్ పరిశ్రమకు గేదెలు తరలిస్తున్న వాహనాలకు సంబందించి ఎన్నో నిబందనలు ఉన్నాయని, ఆ విషయంలో సంబందిత రవాణ అధికారులు తనిఖీలు నిర్వహించాలని, అధికారులు నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రభుత్వం ఎన్నొ నిబంధనలు విధించిందని వాటిని అమలు అధికారులు అమలు చేయాలని, ఆ లేహ్యం ఫుడ్ పరిశ్రమ కాలుష్యంవల్ల సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేయలేక పొతున్నామని రైతులు వాపోతున్నారని అన్నారు. వాతావరణాన్ని పాడుచేసి హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అధికారులు ప్రజావసరాలు, నిబంధనలు మాత్రమే పాటించి నిష్పక్షపాతంగా వ్యవరించాలని అన్నారు. అదేవిదంగా ఆటోలు నడుపుకునే వారికి ఈ మధ్యన జ్యూరిస్డిక్షన్ నిబంధనలు తణుకు ప్రాంతంలో వచ్చాయని అన్నారు. ప్రస్తుతం తణుకు పరిసర ప్రాంతాలు జిల్లాల విభజనవల్ల ఒక రోజులో చాలా సార్లు జిల్లా దాటి ప్రయాణికులతో ఆటోలు తణుకు రావలసి వస్తుందని, అటువంటి సంధర్భంలో అన్ని ఆటోలకు రూల్స్ వర్తిస్తున్నాయా? ఎంతమందితో పెనాల్టెలు కట్టిస్తున్నారని ప్రాంతీయ రవాణా అధికారి శ్రీనివాసును ఎం.ఎల్.సి. వంకా రవీంద్ర ప్రశ్నించారు. ఆటోలకు సంబందించి రూల్స్, ఇబ్బందులు తమకు చెబితే అసెంబ్లీ లో ప్రశ్న లేవనెత్తుతామని అన్నారు. ప్రజలకు సౌకర్యం కలిగించే విషయాల పట్ల అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. గంజాయి, అసాంఘిక పనులు చేస్తే ఆటోలను పట్టుకుని నిర్బందించాలిగాని, రోడ్ దాటితే జిల్లా మారిపొయే పరిస్థితిలో ఒక చిన్న ఆటో డ్రైవరుతో 3,400 రూపాయలు పెనాల్టీ కట్టించారని దానివల్ల ప్రభుత్వానికి ఎమి ఉపయోగం అన్నారు. ప్రతీఅధికారి ఎంతో నిబద్దతతో పనిచేయాలని, ఒత్తిడితో కాదని, నిష్పక్షపాతంగా రాజకీయనాయకులకు చెప్పాలని అన్నారు. మండల అభివృద్దే అందరి ధ్యేయంగా ఉండాలని ఆ విదంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని అన్నారు.
సదరు సమావేశమునకు ఎం.ఎల్.సి. వంక రవీంద్ర, జడ్.పి.టి.సి. సభ్యులు శ్రీమతి ముళ్ళపూడి అన్నపూర్ణదేవి, మండల ఎం.పి.టి.సి. సభ్యులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్.లోహిత్ జయసాగర్, ఏ.ఒ. వి.కృష్ణచంద్రరావు, మండల స్థాయి అధికారులు, మండలం పంచాయతీ కార్యదర్శులు, మండలం ప్రజాపరిషత్ సిబ్బంది హాజరు అయ్యారు.


