వివిధ పార్టీలలో ఉంటూ మంచి ఉన్నత స్థానాలు మన కార్మికులకు లభించడం హర్షణీయమని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంటి వీరన్న పేర్కొన్నారు. శనివారం స్థానిక బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీసు నందు భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన బొల్లాడ నాగరాజు, జనసేన పార్టీ తణుకు పట్టణ ఉపాధ్యక్షులు సుంకర ప్రసాద్ జిల్లా కేంద్రఆసుపత్రి అభివృద్ధి కమిటీలో నూతనంగా సభ్యునిగా ఎన్నికైన కారణంగా వీరి ఇరువురికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తణుకు తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇంటి వీరన్న మాట్లాడుతూ కార్మికునిగా ప్రయాణం మొదలుపెట్టి తణుకు యూనియన్ లో బాధ్యతలు స్వీకరించి, జిల్లా యూనియన్ ను బలోపేతం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా అందరి మన్ననలు పొందుతూ నేడు భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులుగా బొల్లాడ నాగరాజు ఎన్నిక కావడం, జనసేనపార్టీ తణుకు పట్టణ ఉపాధ్యక్షులు సుంకర ప్రసాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో సభ్యునిగా ఎన్నిక కావడం హర్షినీయమన్నారు. జిల్లా మాజీ అధ్యక్షులు గండి రామకృష్ణ మాట్లాడుతూ పదవులు అలంకారానికి మాత్రమేనని ఇరువురు యూనియన్ కి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తూ అందరి మన్ననలు పొందాలన్నారు. తణుకు అధ్యక్షులు కొక్కిరిమెట్టి సత్తిబాబు మాట్లాడుతూ యూనియన్ లోని కార్మికులకు బారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలలో ఉన్నత స్థానాలు లభించడం చాలా ఆనందదాయకమన్నారు. కార్మిక నాయకులుగా పనిచేస్తూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నుండి రాజకీయ నాయకులుగా రాణించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు కొమ్మన శ్రీనివాసు, వెన్న నాగేశ్వరరావు, నాగిరెడ్డి గోవిందరాజులు, కొమ్మన విష్ణు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాసాబత్తుల అనుకుమార్, తణుకు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జీళ్ళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఉపాధ్యక్షులు మోటీపల్లి దుర్గారావు, కార్యదర్శి గంటా శ్రీనివాస్, వడ్డీ రాము, వల్లూరి బాబి, సకినాల గణేష్, జనసేన పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


