అత్తిలి గ్రామపంచాయతీ పరిధిలో “జంతు సంక్షేమ పక్షోత్సవాల (january 14 th to 30th) సందర్భంగా వీధి కుక్కలకి గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో డాక్టర్ కే.నరసింహారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రాంతీయ పశువైద్యశాల, అత్తిలి వారి పర్యవేక్షణలో పశుసంవర్ధక సహాయకులు వీధి కుక్కలకి ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ , జిల్లా జంతు సంక్షేమసంఘం డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్, మండల టిడిపి నాయకులు ఆనాల నారాయణ, ఆల్తి సత్యనారాయణ గ్రామ సర్పంచి, పంచాయతీ సెక్రటరీ, పశుసంవర్ధక సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ డిజిటల్ స్కూల్ లో 8,9,10 తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోత నీడి శ్రీనివాసరావు అత్తిలి పట్టణ టిడిపి నాయకులు మాట్లాడుతూ పశువుల్ని ప్రజలు పూర్వం నుంచి కూడా ప్రేమపూర్వకంగా చూసుకునే వారు అని ఆ సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి పర్వదినాన కనుమ పండుగ రోజుపశువులకి పూజలు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా జంతు సంక్షేమసంఘం డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్ మాట్లాడుతూ పెంపుడు కుక్కలకి, వీధి కుక్కలకి రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు చేయించుకోవాలని తద్వారా వ్యాధిని అరికట్టాలని తెలిపారు. అలాగే వీధి పశువులకి వీధి కుక్కలకి జబ్బులు బారిన పడినప్పుడు వాటిని రక్షించాలని పశువులు పట్ల ప్రేమపూర్వకంగా మెలగాలని పశువుల పట్ల జాలి, దయా గుణం కలిగి ఉండాలని మరియు ఎవరైనా పశువులను అనవసరమైన పెయిన్ కి గురి చేసినట్లయితే వారి మీద SPCA 1960చట్టం ప్రకారం చర్య తీసుకో పడుతుందని తెలిపారు మరియు ఆ చట్టం మీద విద్యార్థులు కి అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని చెట్లు విరివిగా పెంచాలని తెలిపారు.


