అమలాపురం కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన చిత్రకళ పోటీలలో తణుకు పట్టణానికి చెందిన చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాష్ట్ర బీసీ మహిళా నాయకురాలు వావిలాల సరళాదేవి పోటీలలో అవార్డును అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ చిత్రక ళా పరిషత్ అధ్యక్షుడు కొరసాల సీతారామస్వామి ఆమెకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్న ఈ చిత్రకళ పోటీలలో సరళాదేవి పాల్గొని తన ప్రతిభను చూపించారని ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ అవార్డును అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కోనసీమ చిత్రకళ పరిషత్ అవార్డును అందుకున్న వావిలాల సరళాదేవి మాట్లాడుతూ ఈ అవార్డు రావటం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.


