వైసిపి సోషల్ మీడియా కార్యకర్త పంజా దుర్గారావు పై తణుకు శాసనసభ్యులు ఆరీమిల్లి రాధాకృష్ణ దుర్భాషలాడి దౌర్జన్యంగా ఆటోను అడ్డగించి ఒక సామాన్య ఆటో డ్రైవర్ పై కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలానికి చెందిన పంజా దుర్గారావు అనే జగన్ అభిమాని తన ఆటోపై జగన్మోహన్ రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు సునీల్ ఫోటోలు వేసుకోవడం చూసి ఎమ్మెల్యే రాధాకృష్ణ తట్టుకోలేకపోయారని, కారుకు దారి ఇచ్చినప్పటికీ వెళ్లకుండా నడిరోడ్డులో ఆటోను అడ్డగించి దుర్భాషలాడి అక్రమ కేసులు బనాయించారని అన్నారు. అంతేకాక దుర్గారావు తమ కారుకు అడ్డువచ్చి తన అనుచరుడిని చంపేస్తానని బెదిరించినట్లు కట్టు కదా అల్లి కేసు పెట్టించారని దుయ్యబట్టారు. ఆటో వెనుక ఎమ్మెల్యే కారు ఎంత దూరం ప్రయాణించింది ఎలా ప్రయాణించింది అనేది సి.సి. ఫుటేజ్ తమ వద్ద ఉన్నాయని వాటిని బయట పెడితే ఎమ్మెల్యే దురాగతం బయటపడుతుందని, కానీ గతంలో ప్రజాప్రతినిధిగా చేసిన వ్యక్తిని కనుక తన సంస్కృతి అది కాదు కాబట్టి రాష్ట్రపతి రోడ్ లో రిలయన్స్ ప్రాంతంలో దుర్గారావు ఆటోకి ఎమ్మెల్యే కారును అడ్డుపెట్టిన దృశ్యాలు పత్రికా సమావేశంలో చూపిస్తున్నానని అన్నారు. లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో తేతలిలో నిర్వహిస్తున్న పశువదశాలను సంస్థ చూపించిన అనుమతులు అక్రమమని వారికి అనుమతులే లేవని గో సేవాసమితి సభ్యులు సీనియర్ న్యాయవాదులు తహసిల్దార్ ముందు నిరూపించిన, పశువధశాల కొనసాగుతుంది అంటే దానికి స్థానిక ఎమ్మెల్యే కారణము అని అన్నారు. జిల్లా కలెక్టర్ వారం రోజులలో విచారణ చేయించి నివేదిక ఇస్తామని చెప్పగా అందుకోసం ఎదురుచూస్తున్నామని కారుమూరి స్పష్టం చేశారు. లేహం ఫుడ్స్ సంస్థ తణుకు ప్రాంతంలో సెంటు భూమి కూడా కొనుగోలు చేయలేదని, అందువలన ఆ సంస్థ నష్టపోయేది ఏమీ ఉండదని, అటువంటి సందర్భంలో ప్రజావాసాలకు దూరంగా ఎక్కడైనా సంస్థను స్థాపించుకోవచ్చు అని అన్నారు. తణుకు పట్టిన ఈ పశువధశాల అనే దరిద్రాన్ని ఎమ్మెల్యే ఆపకపోతే రాబోవు రోజుల్లో శాంతియుత ధర్నాలు, పాదయాత్ర చేయనున్నట్లు కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరవలి ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్, వైఎస్ఆర్సిపి పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జల్లూరి జగదీష్, వీరమల్ల ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.


