మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల తిరుపతిలో నిర్వహించిన “వికసిత భారత్ ” ఒకరోజు స్పాట్ పెయింటింగ్ పోటీలో తణుకు కు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు లక్ష రూపాయలు ప్రథమ బహుమతి గెలుచుకున్నారు
ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, రీజినల్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ పోటీ తిరుపతి లో ఇటీవల జరిగింది.
ఇవాళ తిరుపతి శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల ప్రాంగణంలో జరిగిన బహుమతి ప్రధానోత్సవం లో ఎస్.వి.వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాణి సదాశివ మూర్తి, ఎస్.వి. యూనివర్సిటీ ఫార్మర్ ప్రిన్సిపల్, డీన్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ డి. కిరణ్ కాంత్ చౌదరి,
రీజినల్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె. టి.వి. రాఘవన్,
శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ కె.వెంక రెడ్డి, జాతీయ చిత్రకారుడు డాక్టర్ సాగర్ గిన్నె చేతులు మీదుగా లక్ష రూపాయల చెక్కు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం దుశ్శాలువ తో సత్కారం అందుకున్నారు.
చిత్రకళలో లక్ష రూపాయలు బహుమతి అందుకున్న విశేష ప్రతి ప్రతిభ కనబరిచిన డాక్టర్ వెంపటాపు ను స్వగ్రామం ఇరగవరంలో గురువులు తంగిరాల పాల గోపాల కృష్ణ, బాల్య మిత్రులు తంగిరాల గోపి, పొన్నా రామకృష్ణ, నీలిరోతు త్రిమూర్తులు వేండ్ర సూరి, మల్లుల రామ సత్యనారాయణ,
తణుకు పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు.



