అత్తిలి మండలంలో పొలం పిలుస్తుంది

అత్తిలి మండలం బొంతువారి పాలెం, స్కిన్నెరపురం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులందరూ ఆగస్టు 15వ తారీకు ఎకరానికి 210 రూపాయలు ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించుకోవాలని, బ్యాంకు రుణం ఉన్న రైతులు సంబంధిత బ్యాంక్ ద్వారా ప్రీమియం చెల్లించబడుతుందని. బ్యాంకు రుణం లేని రైతులు పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంక్ ఎకౌంట్ పుస్తకం, ఆధార్ కార్డ్ మరియు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి సిటిజన్ సర్వీస్ సెంటర్ లేదా మీసేవ సెంటర్ నందు ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించుకోవాలని తెలియజేయడమైనది. రైతులకు పంటల బీమా పై ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత రైతు సేవకేంద్రం ఇన్చార్జి లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని రైతులకు తెలియజేయడమైనది.

Scroll to Top
Share via
Copy link