తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో  జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ 

మాజీ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, శనివారం తణుకు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ” జగన్ 2.0 సూపర్ యాప్ ” ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా  వైఎస్సార్సీపీ  నాయకులు మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక అని, వారిని మరింత బలోపేతం చేయడం, పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలకు నేరుగా అనుసంధానం చేయడం, ప్రజాసమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతోనే “జగన్ 2.0 సూపర్ యాప్” ను పార్టీ అధ్యక్షులు  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు.
అలాగే ప్రతి కార్యకర్త ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, వేధింపులు, కేసుల వివరాలను ఈ యాప్ ద్వారా నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావచ్చని వివరించారు.

Scroll to Top
Share via
Copy link