2026 – 2027 సంవత్సరమునకు ఉండ్రాజవరం మండల మానవతా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం పాలంగిలోని కనకదుర్గ ఆలయము నందు కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా మానవతా జిల్లా అధ్యక్షులు కండెపు సూర్యనారాయణ, ఆర్ . గంగాధర్ రావు, తణుకు మానవతా సంస్థ సీనియర్ సభ్యులు డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, శ్రీమతి బోయపాటి రామలక్ష్మి, గమని రాంబాబు, ఎస్. వి. సతీష్ బాబు, ఉప్పలపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మానవత ద్వారా మరిన్ని సమాజసేవా కార్యక్రమాలు చెసేలా ప్రయత్నం చేయాలని కొరారు. ఈ సమావేశంలో ఉండ్రాజవరం మండల మానవతా సంస్థ నూతన కార్యవర్గ సభ్యులుగా డైరెక్టర్ బోర్డ్ యందు చైర్మన్ ఎం.వి. రమణారెడ్డి, కో-చైర్మన్ కడలి మాణిక్యాలరావు, కన్వీనర్ వేములపల్లి సుదర్శనశ్రీనివాసరావు, డైరక్టర్లుగా ఉప్పలపాటి శ్రీనివాసు, పుల్లే వెంకట సూర్యనారాయణ, ఫనితిని పార్వతి, గంగిశెట్టి శ్రీనివాసరావు, నామాల శివరామక్రిష్ణ, జే.చంద్రప్రసాద్, గౌరవ డైరక్టర్గా పాలంగి గ్రామానికి చెందిన వెలిచేటి బోస్, అధ్యక్షులు నందిగమ్ వెంకటకృష్ణ పాపారావు, కార్యదర్శి రుద్రు నరసింహారావు, సహాయ కార్యదర్శి కోడూరి సుబ్బారావు, కోశాధికారి కటారి సిద్ధార్థరాజు, కరుటూరి శ్రీనివసరావు, మేళం సంజీవరావు, ఇనుకొండ సురేష్, సుంకవల్లి వెంకటెశ్వరరావు మొదలగు సభ్యులచే కార్యవర్గ సమావేశం ప్రమాణస్వీకారం జరిగినది.



