జనచైతన్యం తోనే ప్రజాస్వామ్య పరిరక్షణ – జనవిజ్ఞాన వేదిక నాయకులు

రాజ్యాంగానికి ప్రజలే కర్తలని, ప్రజాస్వామ్యానికి ప్రజలే యజమానులని జన చైతన్యంతోనే వాటిని పరిరక్షించు కోవాలని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా. వి. బ్రహ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక యస్. సి. ఐ. యం. డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ” ప్రజాస్వామ్య విలువలు – పౌరసమాజం కర్తవ్యాలు ” అన్న అంశంపై డా బి రమేష్ చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ప్రజాస్వామ్యం లో యజమానులైన ప్రజలే తమ అధికారాన్ని ఓటు ద్వారా తమ పన్నుల తో పాలనకు నిధులను ఇస్తున్నారని వివరించారు. ప్రజలు యజమానులుగా వ్యవహరించే చైతన్యాన్ని ప్రదర్శిస్తే పాలకులు సేవకులుగా జవాబుదారీతనం తో వ్యవహరిస్తారని అన్నారు. అలా కాకుండా ప్రజలు కేవలం ఓటర్లుగా , లబ్ధిదారులుగా మిగిలిపోతే పాలకులే పెత్తందారులు , నియంతలు అవుతారని అలాంటి వికృత ప్రజాస్వామ్యం ప్రజాకంటకం అవుతుందన్నారు.ప్రజలను యజమానులను చేసే ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే కృషిని పౌరసమాజ సంస్థలు తమ కర్తవ్యంగా చేసుకోవాలని సూచించారు. సమావేశాన్ని డి. వి. వి. యస్. వర్మ ప్రారంభిస్తూ తణుకులో రాజ్యాంగ ప్రచార వేదిక పేరుతో సాగిస్తున్న కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడాని 18 పట్టణాలలో కార్యకలాపాలు నిర్వహించడానికి 185 మంది మిత్రులు ముందుకు వచ్చారని తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన ” భారత ప్రజలమైన మనం( we the people of India ) పేరును నిర్ణయించి వివిధ పట్టణాల లో కార్యక్రమాలు సాగిస్తున్నామని ఆసక్తి గల మిత్రులు ఈ సంస్థ లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు
“భారత ప్రజలమైన మనం” సంస్థ ఆశయాలను వివరించే ” బ్రోచర్ ” ను ఆవిష్కరించారు.
రాజ్యాంగ ప్రచార వేదిక లో , సీనియర్ సిటిజన్స్ సంస్థల లో క్రియాశీల పాత్ర పోషించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ అడ్డాల సత్యనారాయణ మృతికి సంతాపం ప్రకటించారు. రాజ్యాంగ పీఠిక పఠనంతో ప్రారంభమైన ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ సంకు మనోరమ, కొవ్వలి ఆంజనేయ శర్మ, పేరూరు మురళీ కుమార్, అడ్వకేట్ పెనుమర్తి రంగారావు,నీలం మాల్యాద్రి, సబ్బితి వరప్రసాద్, కొండే నాగేశ్వరరావు, అడ్వకేట్స్ కామన మునుస్వామి, పొట్ల సురేష్ , దిర్శిపో రామకృష్ణ , పి.పుల్లంరాజు, సీనియర్ సిటిజన్స్ ఎ.కరుణాకర చౌదరి, స్వాలేహా, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, కోడూరి అంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, టి.అప్పలస్వామి, యు రమేష్ , గార ప్రసాద్ ఇంకా వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link