జైలులో ముద్దాయిల పరిస్థితిపై తనిఖీలో భాగంగా శనివారం గౌరవ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీమతి సిరిపురపు శ్రీదేవి తణుకు సబ్ జైల్ ను సందర్శించి జైల్లో ఉన్న డిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు, ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే వారికి మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. జైలు విజిటింగ్ న్యాయవాది, మరియు పారా లీగల్ వాలంటీర్ లు వారానికి రెండు రోజుల జైలు క్లినిక్ లో సలహాలు ఇస్తారని తెలిపారు, ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు గౌరవ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సిరిపురపు శ్రీదేవి, జిల్లా న్యాయ సేవా సంస్థల సెక్రటరీ శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి, జైలు ఇంచార్జి సూపరింటెండెంట్ ఎన్. శ్రీహరిరావు, ప్యానెల్ న్యాయవాది శ్రీమతి కే.ఎల్. సత్యవతి , పారా లీగల్ వాలంటీర్ కాకర్ల నరసన్న తదితరులు పాల్గొన్నారు.



