మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవ అవగాహనా సమావేశం

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని అవగాహనా సమావేశం శనివారం తణుకు ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పోలిటెక్నీక్ కాలేజీ నందు తణుకు మండల న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర్. ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ వినియోగం వల్ల అనేక మంది తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపించవలసిన బాధ్యత అందరి మీద ఉందని మత్తుపదార్థాలు వినియోగలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, కస్టపడి చదివి సమాజంలో ఉన్నత స్థితికి రావాలని ఆమె అన్నారు. ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, రవాణా చేయడం, సేవించడం తెలిసినట్లయితే ఈగల్ టోల్ ఫ్రీ no.1972 కు తెలుపాలని, శిక్షలు కటినంగా ఉన్నాయని, విద్యార్దులు చుట్ట, సిగరెట్, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సి.ఐ. ఎస్. మణికంఠ రెడ్డి, కోరారు, న్యాయవాది శ్రీమతి పోణంగి శ్రావణి సమీర మాట్లాడుతూ ఇప్పుడు పిల్లలు మొబైల్ అడిక్షన్ కు బానిసై చదువుమీద శ్రద్ధ కనపర్చ లేకపోతున్నారని, ప్రతి విద్యార్థి తల్లితండ్రులను గౌరవించాలి, ముదుసలి వయసులో వారిని ఓల్టేజ్ హోమ్ లకు పరిమితం చేయకుండా చూసుకోవాలని తెలిపారు, ఎవరైనా మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని అని నిర్ణయించుకుంటే మండల న్యాయ సేవల సంస్థ ద్వారా వారికి డ్రగ్ అడిక్షన్ సెంటర్ ల ద్వారా ట్రీట్మెంట్ ఉచితంగా అందేలా చూస్తారని డాక్టర్ నల్లమిల్లి కృష్ణ రెడ్డి తెలిపారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ పాల మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆర్.ఎక్స్. ఎన్.ఆర్.ఎక్స్., మందులకు తేడా ఉందని, ఆర్.ఎక్స్ మందులు మామూలుగా వాడే మందులను, ఎన్.ఆర్.ఎక్స్. మందులు మత్తు మందులను డాక్టర్లు పర్యవేక్షణలో మోతాదుకు మించి వాడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర్. ఆశీర్వాదం పాల్, కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి డా. నర్కేర్మల్లి తులసిరాధ, న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, శ్రీమతి పోణంగి శ్రావణి సమీర, జి. చంద్రరావు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మణికంఠ రెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్ పాల మల్లికార్జునరావు, డా. నల్లమిల్లి కృష్ణరెడ్డి, ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్, తణుకు, పారా లీగల్ వాలంటీర్ కాకర్ల నరసన్న, గంట అజోర్, శ్రీమతి కే. నాగమల్లీశ్వరి, ఎం. శ్రీదేవి ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link