ఎస్.కె.ఎన్.డి మహిళా కళాశాలలో “అంతర్జాతీయ యోగా దినోత్సవం”

స్థానిక ఎస్.కె.ఎన్.డి మహిళా కళాశాలలో “అంతర్జాతీయ యోగా దినోత్సవం” పురస్కరించుకొని మరియు యోగాంధ్ర లో భాగంగా యోగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి కట్టుంగ రామచక్రధరరావు యోగాసన స్టోర్ట్స్ అసోసియేషన్, పశ్చిమ గోదావరి విచ్చేసి ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక, వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు మరియు ఆత్మలను అనుసంధానించే ఒక ప్రాచీన జీవన విధానమని, ప్రతీరోజు యోగా చేయడం వలన శరీరానికి తేజస్సు, రోగనిరోధకశక్తి మెరుగుపడుతుందని, దైనందిన జీవితంలో ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్ధినులకు వివిధ రకాల యోగాసనాలను చేయించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన తణుకు మున్సిపల్ కమీషనర్ టి. రాంకుమార్ మాట్లాడుతూ విద్యార్థినులకు ప్రతీ రోజు యోగా జీవితంలో ఒక భాగం కావాలని, చదువుతోపాటు యోగాను అనుసంధానం చేయడం వలన, కేరీర్ వృద్ధిలో యోగా సహాయపడుతుందని, కమ్యూనికేషన్ మరియు ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు డిప్లమో ఇన్ యోగా కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు సర్టిఫికెట్లన్ను ప్రధానం చేసినారు. ఈ సందర్భంగా యోగా గురువు కట్టుంగ రామచక్రధరరావు ని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి బి. హెచ్. హిమబిందు, ఎస్.డి. కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ వి.వి.వి. సత్యనారాయణరెడ్డి, యోగా ట్రైనర్. కుమారి జి. అన్నపూర్ణ, ఎన్.సి.సి కేర్ టేకర్ శ్రీమతి ఏ. దీప్తి, ఎన్.ఎస్. ఎస్. కో- ఆర్టినేటర్స్ శ్రీ సి. హెచ్. రమేష్ బాబు, శ్రీమతి కె.వి. శ్యామలదేవి, విద్యార్థిని, విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link